Thursday, January 16, 2025
Homeచిత్ర ప్రభDaaku Maharaaj: రూ.100 కోట్ల క్ల‌బ్‌లో బాలయ్య ‘డాకు మ‌హారాజ్’

Daaku Maharaaj: రూ.100 కోట్ల క్ల‌బ్‌లో బాలయ్య ‘డాకు మ‌హారాజ్’

నటసింహం బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘డాకు మహారాజ్‌’(Daaku Maharaaj)సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమాలో బాలయ్య డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, థమన్ బీజీఎం గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. సరికొత్త అవ‌తారంలో బాల‌య్య క‌నిపించ‌డంతో ప్రేక్ష‌కులు ఈ చిత్రానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. నాలుగు రోజుల్లో ఈ చిత్రం రూ.105 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు సాధించినట్లు మూవీ యూనిట్ ఓ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. దీంతో బాల‌య్య అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు.

- Advertisement -

కాగా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.56 కోట్లు వసూలు చేసి బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది. సంక్రాంతి సెల‌వులు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఈ చిత్రం భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టే అవ‌కాశం ఉంది. మ‌రో రెండు, మూడు రోజుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటుందని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ చిత్రంతో వరుసగా నాలుగు రూ.100కోట్ల మూవీలు రాబట్టిన సీనియర్‌ హీరోగా బాలకృష్ణ రికార్డు సృష్టించారు. అంతకుముందు అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు చేశాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News