కర్ణాటక(Karnataka)లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బీదర్‌లోని శివాజీ చౌక్‌లో ఏటీఎం వాహన సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలోని ఏటీఎం కేంద్రంలో డబ్బు పెట్టేందుకు సిబ్బంది వచ్చారు. అదే సమయంలో ఓ ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సిబ్బందిపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు.
- Advertisement -
అనంతరం డబ్బులను తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బందిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.