ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది. సంక్రాంతి సెలవుల సందర్భంగా సరదాగా గడిపేందుకు వచ్చిన స్నేహితులు సముద్రంలో గల్లంతయ్యారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్(Pakala Beach)లో సముద్ర స్నానానికి కొంతమంది వచ్చారు. సముద్ర స్నానం చేస్తుండగా అలల ధాటికి ఆరుగురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు మత్స్యకారుల సాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు.
- Advertisement -
ఈ నేపథ్యంలో ఇద్దరు బాలికలు, ఓ యువకుడి మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను పొన్నలూరు మండలం తిమ్మపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.