Thursday, January 16, 2025
HomeఆటTeam India: టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్ నియామకం..!

Team India: టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్ నియామకం..!

టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్‌గా సితాంశు కోటక్(Sitanshu Kotak) పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియా-ఏ జట్టు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న కోటక్.. 1992 నుంచి 2013 వరకు దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 130 ఇన్నింగ్స్‌లలో 41.76 సగటుతో 8,061 పరుగులు చేశాడు. అందులో 15 సెంచరీలు, 55 అర్ధసెంచరీలు ఉన్నాయి. 2023లో బుమ్రా నాయకత్వంలో ఐర్లాండ్‌లో టీ20 సిరీస్ ఆడిన భారత జట్టుకు కోటక్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు.

- Advertisement -

బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్‌గానూ పనిచేశాడు. గత నాలుగేళ్లుగా ఇండియా-ఏ టీమ్ బ్యాటింగ్ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. 2017 ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ లయన్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా టీమిండియా బ్యాటింగ్ కోచ్ రేసులో ఉన్నట్టు సమాచారం. తనకు భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా రావాలని ఉందని ఇటీవలే ప్రకటించాడు.

కాగా గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అసిస్టెంట్ కోచ్‌లుగా భారత మాజీ క్రికెటర్ అభిషేక్‌ నాయర్‌తోపాటు టెన్ డెస్చటేను ఎంచుకున్నాడు. బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కల్ వ్యవహిరస్తున్నాడు. గంభీర్ స్వతహాగా బ్యాటర్‌ కావడంతో ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్‌ను నియమించుకోలేదు. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మీద భారత బ్యాటింగ్ పేలవంగా ఉండటంతో బ్యాటింగ్ కోచ్‌ను నియమించాలని బీసీసీఐ డిసైడ్ అయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News