Thursday, January 16, 2025
Homeటెక్ ప్లస్KLU: కె ఎల్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ రిజల్ట్స్ రిలీజ్

KLU: కె ఎల్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ రిజల్ట్స్ రిలీజ్

అడ్మిషన్స్ కోసం

కె ఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ లలో ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించిన మొదటి విడత ఇంజినీరింగ్ ప్రవేశపరీక్ష ఫలితాలను యూనివర్సిటీ ఉప కులపతి డాక్టర్ పార్ధసారధివర్మ గురువారం విడుదల చేశారు.

- Advertisement -

ఆన్లైన్ లో రిజల్ట్ రిలీజ్

విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆన్ లైన్ ద్వారా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ స్థాయిలో నిర్వహించిన మొదటి విడత పరీక్షలో లక్ష మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఇందులో 80 శాతం మంది విద్యార్థులు అర్హత పొందారని పేర్కొన్నారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని, అలాగే విద్యార్థులకు కూడా నేరుగా పంపిస్తామని చెప్పారు.

మెరిట్ ఆధారంగా స్కాలర్షిప్

కె ఎల్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకులు, ఇంటర్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు స్కాలర్షిప్ ద్వారా ఫీజులో మినహాయింపు ఇస్తామని చెప్పారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే మెరిట్ విద్యార్థులకు ఈ స్కాలర్షిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. రెండవ విడత ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించిన విధంగానే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సైన్స్ కోర్సుల అడ్మిషన్స్ కోసం కూడా జాతీయ స్థాయిలో మెరిట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే ఇంజినీరింగ్ మొదటి విడత ప్రవేశ పరీక్షలో మెరుగైన ర్యాంకు పొందలేని విద్యార్థులు రెండవ విడత నిర్వహించే ప్రవేశ పరీక్ష రాసుకోవచ్చని చెప్పారు. కన్వీనర్ డాక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. ప్రవేశ పరీక్షల ఫలితాలు, పూర్తి వివరాల కోసం www.kluniversity.in ໖ 9648229999 .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News