Thursday, January 16, 2025
HomeNewsSaif : సైఫ్ పై దాడి చేసింది ఇతడే.. కీలకంగా మారిన సీసీటీవీ ఫుటేజ్..!

Saif : సైఫ్ పై దాడి చేసింది ఇతడే.. కీలకంగా మారిన సీసీటీవీ ఫుటేజ్..!

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై ఓ దుండగుడు కత్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన మొంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సైఫ్‌కు శస్త్రచికిత్స చేసిన వైద్యులు నటుడి వీపు నుంచి దాదాపు రెండున్నర అంగుళాల పొడవున్న కత్తి మొనను తొలగించినట్లు తెలిపారు. న్యూరాలజీ నిపుణుడు డాక్టర్ నితిన్ డాంగే లీలావాలి హాస్పిటల్‌లో తన శస్త్రచికిత్సను నిర్వహించారు.

- Advertisement -

కత్తిలోని ఈ భాగాన్ని ఆపరేషన్ చేసి తొలగించామని, అక్కడ నుంచి వెన్నెముక ద్రవం లీక్ అవుతుందని చెప్పారు. ఇది శస్త్రచికిత్స ద్వారా మరమ్మత్తు చేయబడింది. కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ కుడ్వా పర్యవేక్షణలో సైఫ్‌కి ఈ సర్జరీ జరిగింది. సైఫ్ ఇప్పుడు ప్రమాదం నుంచి బయటపడ్డారని తెలిపారు. సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితిపై లీలావతి ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. సైఫ్ అలీ ఖాన్‌కు శరీరంపై మొత్తం ఆరు కత్తి గాయాలు ఉన్నాయని వాటిలో రెండు లోతైనవి తీవ్రంగా ఉన్నాయని లీలావతి ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) డాక్టర్ నీరజ్ ఉత్తమని , డాక్టర్ నితిన్ డాంగే మీడియాకు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రిలోనే ఉంచడం మంచిదని తెలిపారు.

మరోవైపు ఈ సంఘటనపై ముంబై పోలీసులు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు, ఇందులో సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించినట్లు ధృవీకరించబడింది. ఈ ఘటనకు పాల్పడింది ఎవరన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో సీసీటీవీ ఫుటేజి కీలకంగా మారింది. రాత్రి 2.33 గంటల సమయంలో రికార్డయిన ఫుటేజి ప్రకారం… ఓ దుండగుడు సైఫ్ అలీ ఖాన్ నివాసం నుంచి పారిపోతూ సీసీ కెమెరాలకు చిక్కాడు. ఇప్పుడా ఫొటోను ముంబయి పోలీసులు విడుదల చేశారు. అతడి కోసం తీవ్రస్థాయిలో గాలిస్తున్నారు. అయితే ఇంట్లో పని చేసే వ్యక్తుల వాంగ్మూలం రికార్డ్ చేశారు. నటుడిపై దాడి సమయంలో ప్రతిఘటించేందుకు ప్రయత్నించడంతో కత్తిపోట్లకు గురైనట్లుగా రిపోర్ట్‌లో తెలిపారు. దాడి చేసిన వారిలో ఇద్దరిని గుర్తించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News