వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) రెండో కుమార్తె వర్షారెడ్డి లండన్‌లోని ప్రతిష్ఠాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి ఎంఎస్సీ ఫైనాన్స్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబంతో కలిసి దిగిన ఫొటోను జగన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘అత్యంత ప్రతిష్టాత్మకమైన కింగ్స్ కాలేజ్ లండన్‌లో చదివి పట్టభద్రురాలు కావడంతోపాటు డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణత సాధించి మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేశావు. ‘గాడ్ బ్లెస్ యూ’ డియర్” అంటూ ట్వీట్ చేశారు.
కాగా జగన్ కుమార్తెలు ఇద్దరూ విదేశాల్లో చదువుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన చిన్న కుమార్తె వర్షారెడ్డి డిగ్రీ పట్టా ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనేలా లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థననను పరిగణనలోకి తీసుకున్న కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో జగన్ దంపతులు మంగళవారం లండన్ వెళ్లారు. ఈ నెలాఖరు వరకు లండన్‌లోనే ఉండనున్నారు.