ఈరోజు ఎపిసోడ్‌లో దశరథ ఇంటికి రాగానే సుమిత్ర ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. జోత్స్నవైపు కోపంగా చూస్తుంటే కంగారు పడుతుంది. మన రూమ్ డోర్ లాక్ చేసి ఉంది మీరే చేశారా అని అడుగుతుంది. జోత్స్న చేసి ఉంటుంది అని మనసులో అనుకుంటాడు. పని మనిషి లాక్ చేసి ఉంటుందిలే అని అంటాడు దశరథ. జోత్స్నను ఎక్కడికి వెళ్లి వచ్చావు అని అడిగితే తడబడుతుంది. శివన్నారయణ వచ్చి ఏమైంది అని అడుగుతాడు. నీ మాటలు కొత్తగా, తేడాగా ఉన్నాయి అంటే కొత్త విషయాలు తెలిస్తే ఇలానే ఉంటుంది అంటాడు. దశరథ షర్ట్‌కు అంటుకున్న రక్తాన్ని చూసి ఇదెలా అంటుకుంది అని కంగారుగా అడుగుతారు. రుణాల బంధం అని ఏదో చెప్తాడు. దారిలో ఎవరికో ఆక్సిడెంట్ జరిగితే హెల్ప్ చేశాను అంటాడు. దారిన పోయే వారికేగా ఏమైందిలే అంటుంది పారిజాతం. అప్పుడు దశరథ నీ కొడుకుని జోత్స్న చంపాలనుకుంటుంది అని మనసులో అనుకుంటాడు.
మరోవైపు శౌర్య ఏమో కార్తిక్ లాకెట్ వేసుకుంటే దీప తిడుతుంది. నాన్నే ఇచ్చాడు అని చెప్తుంది. కార్తిక్ వచ్చి నేనే ఇచ్చాను అని చెప్తాడు. ఎందుకు ఇచ్చారు అని అడిగితే ఇప్పటి నుంచే నీదే అంటాడు. శౌర్య ఆపరేషన్ కోసం అలా ఆలోచిస్తూ ఉంటాడు. దీపకు చెప్పకుండా ఎలా చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటాడు. దీప ఏమైంది అలా ఉన్నారు అని అడుగుతుంది. ఫ్రెండ్ కూతురుకి శౌర్యను తోడు పంపిస్తాను అని మాట ఇచ్చాను అని ఏదో సాకు చెప్పి వారం రోజులు దీపని శౌర్య దగ్గర లేకుండా చేయడానికి చెప్తాడు. దీప ఏమో వద్దు బాబు శౌర్యను ఎక్కడికీ పంపను ఆరోగ్యం బాలేదు కదా తనకి అంటుంది.
అక్కడికి వెళ్తే నయం అవుతుంది మంచి వాతావరణంలో ఉంటే శౌర్య ఆరోగ్యం బాగవుతుంది అంటాడు కార్తిక్. వారం రోజులు మమ్మళ్ని చూడకుండా ఉండగలవా అని అడుగుతుంది దీప. ఉండగలను అమ్మా అని శౌర్య చెప్తుంది. ముందు హాస్పిటల్‌లో రూ.5 లక్షలు కట్టాలి అని ఆలోచిస్తాడు. దీప కుడా ఏదో జరిగింది కార్తిక్ బాబు ఏదో బాధపడుతున్నాడు అని అనుకుంటుంది. కార్తిక్ ఫోన్‌లో డాక్టర్‌తో మాట్లాడిన మాటలు విని రూ.5 లక్షలు ఎవరికి కట్టాలి అని అడుగుతుంది. ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. దానికి రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నాను దాని గురించే ఆలోచిస్తున్నాను అంటాడు. దీప మాత్రం ఆ మాటలు నమ్మకుండా ఆరాతీస్తుంది.
తెలిసిన ఫ్రెండ్‌ని అడుగుతాడు అవసరం ఉంది రూ.5 లక్షలు కావాలని వాడేమో నీతి కబుర్లు చెప్తాడు. ఇంటికి వెళ్లి మీ తాతకు సారీ చెప్పు అంటాడు. దానికి కార్తిక్ గట్టిగా సమాధానం చెప్తాడు. ఈలోగా అక్కడికి కాశీ వచ్చి నీకు డబ్బులు కావాలా తనని ఎందుకు అడుగుతున్నావు నీకు డబ్బు కావాలంటే నన్ను అడగలేవా అని అంటాడు. కార్తిక్ శౌర్య కోసం అని జరిగినది అంతా చెప్తాడు. దీప కి తెలిస్తే శౌర్య కంటే ముందే తను పేషెంట్ అవుతుంది అంటాడు.