బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేవలం 36 గంటల వ్యవధిలోనే నిందితుడిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని నేరుగా బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. దాడికి పాల్పడిన వెంటనే దుండగుడు తొలుత ముంబై లోకల్ ట్రెయిన్‌లో ప్రయాణించినట్లుగా పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. గాలింపు అనంతరం అతడిని అదుపులోకి తీసున్నారు.
మరోవైపు ఈ ఘటనపై సైఫ్ సతీమణి కరీనా కపూర్(Kareena Kapoor) ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. తమ కుటుంబానికి ఇది కఠినమైన రోజు అన్నారు. ఈ క్లిష్ట సమయంలో తమకు మద్దతుగా నిలిచినవారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఊహాజనిత కథనాలు, కవరేజీకి దూరంగా ఉండాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన నుంచి తేరుకునేందుకు తమ కుటుంబానికి కొంత వ్యక్తిగత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాను అని కోరారు.