భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతున్న గాజులరామారం చిత్తారమ్మ జాతరకు ఆలయంలో జాతర ప్రారంభమైంది. సంక్రాంతి తరువాత వచ్చే జనవరి 17 నుంచి 25 వరకు జరిగే 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు దేవాలయం భారీ ఏర్పాట్లు చేసి . సుమారు 5 లక్షల మందికి పైగా తరలివచ్చే భక్తులకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆలయ చరిత్ర ఆసక్తికరం
ఒకప్పుడు గాజులరామారం అంతా నిర్జీవ ప్రాంతంగా ఉండేది. 1970-77 సంత్సవం మధ్యలో గాజులరామారం గ్రామంలో తీవ్రమైన సంక్షోభం తలెత్తింది. గ్రామప్రజలు ఆరోగ్య సమస్యలతో, వర్షాలు సరిగా పడక, రైతులు పండించిన పంట సరిగా చేతికి వచ్చేది కాదు. అప్పుడు గ్రామ ప్రజలంతా, గ్రామసభ ఏర్పాటు చేసి, ఇలా ఎందుకవుతుందోనని ఆలోచించారు. అందులోని సభ్యులు ముడుచింతలపల్లి, కరకపట్ల గ్రామంలో చిత్తారమ్మ టెంపుల్ లో ఉన్న పసుపు- కుంకుమ తీసుకొని వచ్చి, చిన్న అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేసారు. 1976 సంవత్సరంలో కొంతమంది భక్తులు ఇదే ప్రాంగణంలో అమ్మవారిని తిరిగి
పునఃప్రతిష్టించి, ఆలయంగా నిర్మించారు. నాటి నుండి నేటి వరకు, భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా నెరవేస్తూ, నిత్యం నీరాజనాలు అందుకుంటోంది చిత్తారమ్మ అమ్మవారు. ఇక్కడి ప్రజలంతా అమ్మవారిని ఇలవేల్పుగా కొలుస్తుంటారు. చిత్తారమ్మ దేవి జాతర 10 రోజుల పాటు జరుగుతుంది. హైద్రాబాద్ జంట నగరాలలో ప్రారంభం నుండి 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిగే ఏకైక దేవస్థానం శ్రీ చిత్తారమ్మ దేవి దేవస్థానం.
ఆలయ విశిష్టత
దేవాలయం విస్తీర్ణం 1.5 ఎకరాలు. ఈ ఆలయాలలో ఉప ఆలయాలు మూడు ఉంటాయి. 1). రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం. 2). పోచమ్మ తల్లి ఆలయం.3) నాగదేవత ఆలయం. ఆలయానికి వచ్చే భక్తులకు ముందుగా ఆలయ ప్రవేశ ద్వారం స్వాగతం పలుకుతుంది.
గోపురం విశిష్టత
అల్లంత దూరం నుండే, ఆలయ గోపురం దర్శనమిస్తుంది. ఐదంతస్తుల ఈ రాజగోపురంపై అమ్మవారి లీలా విశేషాలు తెలిపే శిల్పాలు భక్తులకు దర్శనమిస్తాయి.
ధ్వజస్థంభం
50 అడుగుల గజస్థంబాన్ని దర్శనం చేస్తే, సమస్త పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.
ఆలయంలో జరిగే అమ్మవారి పూజా కార్యక్రమాలు
చిత్తారమ్మ దేవి సింహవాహినిగా దర్శనమిస్తుంది. ఆగమశాస్త్ర ప్రకారం అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. ప్రతి మంగళ శుక్రవారాల్లో అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢమాసం నాల్గవ ఆదివారం నాడు అమ్మ వారు శాకాంబరీ అలంకరణతో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తుంది. కార్తీక మాసంలో, కార్తీక పౌర్ణమి నాడు లక్ష్య దీపోత్సవం కార్యక్రమం నిర్వహిస్తారు. దసరా నవరాత్రులలో ప్రతి రోజూ ఒక్కొక్క అలంకరణతో అమ్మవారికి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆలయ కమిటీ ఛైర్మన్ కూన అంతయ్య గౌడ్ మాటల్లో
ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ చిత్తారమ్మ దేవి ఆలయం ఈ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ ఉత్సవాలు జరుగుతాయి. ఈ జాతరకు పక్క రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. సుమారు 5 లక్షల మంది భక్తులు హాజరవుతారనీ అంచనా. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు.
బస్సు సౌకర్యాలు…
సికింద్రాబాద్ నుండి, మెహదిపట్నం, అఫ్జల్గంజ్, కూకట్ పల్లి, చుట్టూ ప్రాంతాల నుండి బస్సు సౌకర్యాలు ఉన్నాయి.