Friday, January 17, 2025
HomeతెలంగాణKTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

రైతులకు రుణమాఫీ పూర్తిగా జరిగినట్లు నిరూపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం రాజీనామా చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి మరోసారి సవాల్ విసిరారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రైతు మహా ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రుణమాఫీపై రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతామని తెలిపారు. వానాకాలం పంట సహాయం కూడా ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

రాష్ట్రంలోని ప్రతి మహిళకు రేవంత్ రెడ్డి రూ.30వేలు బాకీ పడ్డారని విమర్శించారు. గత ఏడాది కాలంలో పెళ్లిళ్లు చేసుకున్న యువకులకు కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం బాకీ పడిందని ఎద్దేవా చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నిక రాబోతుందని జోస్యం చెప్పారు. ప్రజలు కేసీఆర్‌కు ఓటేయడంతో ఇక్కడి ఎమ్మెల్యే గెలిచి రేవంత్ రెడ్డి చంకలో దూరాడని మండిపడ్డారు. నియోజకర్గం అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరానని కబుర్లు చెబుతున్నారని ఫైర్ అయ్యారు.

త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను రైతులు, ఆడబిడ్డలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ప్రభ కోల్పోతుందని.. హర్యానా, మహారాష్ట్రలో ఘోరంగా ఓడిపోయిందని గుర్తుచేశారు. ఇన్ని రాష్ట్రాల్లో ఓడిపోతున్నా కాంగ్రెస్ పార్టీ నేతలకు బుద్ధి రావట్లేదని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News