ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్, రుద్రాణిని ఎప్పుడూ ఏదొక గొడవ పుట్టిస్తూ ఉంటావు ఎన్ని సార్లు ఏమి అన్నా బుద్ధి రాదు అని తిడుతూ ఉంటాడు. అప్పుడే ధాన్యలక్ష్మి రుద్రాణి గొడవ పెడుతుంది సరే ఇప్పుడు ఎలాగో నిజం బయటపడింది కదా కనీసం రూ.5 లక్షలు హాస్పిటల్ బిల్ కూడా కట్టడానికి కంపెనీ అకౌంట్ లో లేవా అని అడుగుతుంది. అప్పుడు అపర్ణ ఏం తేలాలి, నగల విషయమా, కంపెనీ విషయమా ఎక్కడ తేలాలి అని అడుగుతుంది. రుద్రాణికి నీకు తేడా లేదని బాగా రుజువు చేస్తున్నావు అంటుంది. అసలు కావ్య నేను చెప్తేనే నగలు తాకట్టు పెట్టింది అని చెప్తుంది.ఎందుకు అని అందరూ అడిగితే కంపెనీ అకౌంట్స్ అన్ని హోల్డ్‌లో పెట్టారని తెలిసే నేనే నగలు తాకట్టు పెట్టి ఆ బిల్లు కట్టమని లేదంటే పరువు పోతుంది అని చెయ్యమని చెప్పాను అంటుంది. రుద్రాణిని నమ్మకుండా బాగా తప్పించేసావు నీ కోడలను, కొడుకుని అంటే రుద్రాణిని నీ బతుకు ఎంత నీకు ఏ హక్కు ఉందని అడుగుతున్నావని గట్టిగా తిడుతుంది. మధ్యలో ధాన్యలక్ష్మి మరి రుద్రాణి ఇందాకటి నుంచి నగల విషయం అడుగుతుంటే అప్పుడు ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది. దానికి నాకు కామన్ సెన్స్ ఉంది కాబట్టి చెప్పలేదు అంటుంది. ఆ మాటలకు రాహుల్, రుద్రాణి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతారు.
అందరూ ఇంటికి వచ్చేసాక కావ్యను అపర్ణ సీరియస్‌గా ప్రశ్నిస్తూ నిలదీస్తుంది. అసలు ఏమి జరుగుతుంది రూ.5 లక్షలు బిల్లు ఎందుకు కట్టలేకపోయారు అని అడుగుతుంది. కావ్య మాత్రం ఏం మాట్లాడదు. ఇందిరా దేవి శాంతంగా ఉండు అని ఆపుతుంది అపర్ణను. మీరు నన్ను నమ్మితే చాలు నేను ఈ ఇంటికి ఎలాంటి అన్యాయం చేయట్లేదు. దారి చూపించిన మీరే ఇలా నిదదీస్తుంటే నాకు ఏమి చేయాలో చేయట్లేదు అంటుంది కావ్య. నువ్వు మాటలను తప్పించుకుని వెళ్లినంత మాత్రానా నీకు ఏమి తెలియదని నేను అనుకుంటున్నాను అనుకుంటునావా.. సరే ఇప్పటి నుంచి నువ్వు నాతో మాట్లాడకు నిజం చెప్పేంత వరకూ అంటుంది అపర్ణ.
ఇక మరోవైపు రాజ్ కావ్యను అసలు ఏం జరుగుతుంది? ఒక్కొకరు ఒకో సారి ప్రశ్నిస్తున్నారు అని అడుగుతాడు. ఇప్పుడు ఏమి చేయాలో అది ఆలోచించండి అంటుంది కావ్య. వీటన్నిటికి ఒక దారి ఉంది ఇంట్లో అందరికీ నిజం చెప్పేదాం అంటాడు రాజ్. హా అప్పుడు కానీ ఇంట్లో ఇంకా గొడవలు, చిచ్చులు పెరగవు. ఇంట్లో నిజం చెప్తే ఏమి జరుగుతుందో తెలుసా ఒక్కొక్కరి రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక సారి చూడండి అని ఒక షో వేస్తుంది కావ్య. వాళ్ల రియాక్షన్స్ రాజ్ షోలో చూసి బాబోయ్ ఇంక వద్దు అని ఇంట్లో చెప్పవద్దు అని రాజ్ అవుతాడు. మనమే మనసులో దాచుకుని మన ఇద్దరమే కుమిలిపోదాం అని రాజ్ అంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.