Sunday, January 19, 2025
HomeతెలంగాణRation Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై.. బిగ్ అప్ డేట్..!

Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై.. బిగ్ అప్ డేట్..!

తెలంగాణలో 6.68 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు రానున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా పౌరసరఫరాలశాఖ అనేక వడపోతల తర్వాత.. జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
వడపోతల అనంతరం జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ఏ చిన్న పథకం పొందాలన్నా రేషన్ కార్డు ఎంతో అవసరం. పేదలకు గుర్తింపు కార్డుగా మారిన రేషన్‌ కార్డులను తెలంగాణలో దాదాపు దశాబ్దకాలంగా ఇవ్వలేదు. దీంతో రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఒక్కసారి కూడా పూర్తి స్థాయిలో పేదలకు రేషన్ కార్డులు అందలేదు. దీంతో అన్ని అర్హతలూ ఉన్నా చాలా మంది ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారు.

- Advertisement -

అయితే ఈ నిరీక్షణలకు త్వరలో బ్రేక్ పడనున్నాయి. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కొత్త రేషన్ కార్డులను అందజేస్తోంది. రేవంత్‌రెడ్డి సర్కార్ తీసుకురానున్న ఐదు గ్యారెంటీలు అమలు చేయాలంటే ముందుగా అర్హులను గుర్తించాలి. ఆవిధమైన అర్హుల గుర్తింపు కోసమే ముందుగా రేషన్‌కార్డులను ప్రభుత్వం జారీ చేస్తోంది. ఇటీవలే నిర్వహించిన ఇంటింటి సర్వేతోపాటు… ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ప్రభుత్వం వివరాలు సేకరించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 6.68 లక్షల కుటుంబాలు రేషన్ కార్డులకు అర్హమైనవిగా గుర్తించారు.

ఈ జాబితాను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపించి ఈనెల 20 నుంచి 24 వరకు గ్రామసభలు, బస్తీ సభలు నిర్వహించనున్నారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా ఖరారు చేయనున్నారు. జిల్లా కలెక్టర్లు ఖారారు చేసిన జాబితా ప్రకారం పౌరసరఫరాల శాఖ కార్డులను మంజూరు చేయనుంది. జనవరి 26వ తేదీ నుంచి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నారు. కొత్త రేషన్‌ కార్డులు కావాలన్నవారి వివరాలు, కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయించుకునేవారి వివరాలను వడబోశారు. అన్ని అర్హతలు పరిశీలించిన తర్వాత 6,68,309 కుటుంబాలకు కొత్త కార్డులు అందజేయాలని నిర్ణయించారు.

గ్రామసభల అనంతరం కొత్త కార్డులు జారీ చేయనున్నారు. హైదరాబాద్‌లోనే అత్యధికంగా 83 వేల285 మంది అర్హులు ఉండగా.. వనపర్తి జిల్లాలో అత్యల్పంగా 6 వేల647 కుటుంబాలు ఉన్నాయి. ప్రస్తుతానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసంతకాలతో కూడిన లేఖలనే కార్డులుగా అందజేస్తారు. కొంతకాలం తర్వాత పాతవారికి, కొత్తవారికి కలిపి కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News