ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి బీసీసీఐభారత జట్టును ప్రకటించింది. ప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకుముందు వాంఖడే మైదానంలోనే దాదాపు రెండున్నరగంటలకుపైగా బీసీసీఐ సమావేశం జరిగింది. దీనికి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ హాజరు కాలేదు. శుక్రవారమే గంభీర్ నివేదికను సమర్పించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక 15 మందితో కూడిన టీమ్‌ను.. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా బీసీసీఐ వెల్లడించింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కూ ఇదే జట్టు కొనసాగుతుందని తెలిపింది. కాగా ఫిబ్రవరి 6 నుంచి 12 మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అనంతరం ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ Aలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో ఫిబ్రవరి 20న, పాక్‌తో ఫిబ్రవరి 23న, న్యూజిలాండ్‌తో మార్చి 2న టీమ్‌ఇండియా దుబాయ్ వేదికగా తలపడనుంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఐసీసీ టోర్నీ జరగబోతోంది. దాయాది దేశం పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. భారత్ ఆడే మ్యాచ్‌లు యూఏఈలోనూ జరగనున్నాయి. చివరిసారిగా టీమ్‌ఇండియా 2013లో ధోనీ నాయకత్వంలో విజేతగా నిలిచింది. మ్యాచ్‌ల నిర్వహణ మొత్తం హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించానున్నారు.
జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, బూమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.