విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా విపరీతంగా నచ్చడంతో మూవీకి వసూళ్ల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ చిత్రం బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ వసూళ్లను దాటేసింది. అది కూడా కేవలం ఐదు రోజుల్లోనే కావడం విశేషం.
తొలి రోజు రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించగా.. రెండో రోజు రూ.32 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగా.. మూడో రోజు రూ.29 కోట్ల మొత్తాన్ని కలెక్ట్ చేసింది. మొత్తంగా మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.106 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇక ఐదు రోజుల కలెక్షన్స్‌ను మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రూ.161కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు ఓ పోస్టర్ విడుదల చేసింది.
దీంతో వెంకటేశ్ కెరీర్‌లోనే అత్యధికి వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచిందని పేర్కొంది. మరో రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేయనుంది. మరోవైపు అమెరికాలో కూడా ఈ మూవీ కలెక్షన్స్‌తో అదరగొడుతుంది. ఇప్పటికే అమెరికాలో 1.8 మిలియన్ డాలర్స్ వసూలు చేసి 2 మిలియన్ డాలర్స్ వైపు పరుగులు పెడుతుంది.