Sunday, January 19, 2025
HomeతెలంగాణHarish Rao: ప్రభుత్వ నిర్లక్ష్యం పేద ప్రజలకు శాపం: హరీష్ రావు

Harish Rao: ప్రభుత్వ నిర్లక్ష్యం పేద ప్రజలకు శాపం: హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం పేద ప్రజలకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) విమర్శించారు. ఆరోగ్య శ్రీ పెండింగ్ బకాయిలపై ఎక్స్ వేదికగా ఆయన మండిపడ్డారు. “పెండింగ్ బకాయిలు విడుదల చేయక పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిన దుస్థితి. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రాష్ట్రానికి పట్టింపు లేకపోవడం దురదృష్టకరం. నెట్‌వర్క్ ఆసుపత్రుల డిమాండ్లు పరిష్కరించి, పెండింగ్ బకాయిలు చెల్లించి ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం” అని తెలిపారు.

- Advertisement -

కాగా తెలంగాణలోని ఆసుపత్రులత్లో ఇవాళ ఉదయం నుంచి ఆరోగ్యశ్రీ(Aarogyasri) సేవలు నిలిపోయాయి. ప్రభుత్వం నుంచి రూ.1000 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉందని ఆసుపత్రి యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో ప్రత్యేకంగా సమావేశమై ఆరోగ్య శ్రీ నిధుల విడుదలపై చర్చించారు. అయితే ఇప్పటికీ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసినట్లు ఆసుపత్రుల యజమాన్యం ప్రకటించింది. సేవలు నిలిచిపోవడంతో ఆసుపత్రుల వద్ద సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News