Sunday, January 19, 2025
Homeఆంధ్రప్రదేశ్Viral Flexi: వైరల్.. ఒకే ఫ్లెక్సీలో కేసీఆర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్

Viral Flexi: వైరల్.. ఒకే ఫ్లెక్సీలో కేసీఆర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్

ఇటీవల తెలంగాణలో రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ఖమ్మం జిల్లాలోని వెంకటాపురం గ్రామంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, హీరో నందమూరి బాలకృష్ణ ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలాంటి ఫ్లెక్సీనే మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండల కేంద్రంలోని గట్టు మైసమ్మ జాతరలో దర్శనిమిచ్చింది.

- Advertisement -

ఈ ఫ్లెక్సీలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR), ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముగ్గురి ఫొటోలు ఉన్నాయి. వీరితో పాటు దివంగత నేత ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ మంత్రి లోకేశ్, బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఫొటోలు సైతం ఉండటం గమనార్హం.

ఈ ఫ్లెక్సీలో బాస్ ఈస్ బ్యాక్ అంటూ చంద్రబాబుకు, ట్రెండ్ సెట్టర్ అంటూ పవన్‌ కళ్యాణ్‌కు, గాడ్ ఆఫ్ తెలంగాణ కమింగ్ సూన్ అంటూ కేసీఆర్‌కు, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అంటూ కేటీఆర్‌కు క్యాప్సన్స్ రాశారు. ఇలా వివిధ పార్టీల నేతలందరూ ఒకే ఫ్లెక్సీలో ఉండటం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాగే ఈ ఫ్లెక్సీ ఇప్పుడు నెట్టింట వైరల్‌ మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News