విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా విపరీతంగా నచ్చడంతో మూవీకి వసూళ్ల వర్షం కురుస్తోంది. ఐదు రోజుల్లోనే రూ.161కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా తిరుమల(Tirumala) శ్రీవారిని మూవీ యూనిట్ దర్శించుకుంది.
వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్‌రాజు, హీరోయిన్లు ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మూవీ యూనిట్‌తో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు.