Sunday, June 22, 2025
Homeనేషనల్Kumbh Mela: మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం

Kumbh Mela: మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Kumbh Mela)లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు పలు గుడారాల్లో మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -

ఓ గుడారంలో సిలిండర్‌ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మంటలు పక్క గుడారాలకు అంటుకోవడంతో పాటు దట్టమైన పొగ వ్యాపించడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News