Sunday, January 19, 2025
Homeనేరాలు-ఘోరాలుRG Kar Incident: నా కుమారుడికి మరణశిక్ష విధించండి.. నిందితుడి తల్లి

RG Kar Incident: నా కుమారుడికి మరణశిక్ష విధించండి.. నిందితుడి తల్లి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ ఆసుపత్రి(RG Kar Incident)ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్‌(Sanjay Roy)ని కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. రేపు(సోమవారం) నిందితుడికి కోల్‌కతా హైకోర్టు అతడికి శిక్ష విధించనుంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై నిందితుడి తల్లి స్పందించారు. తన కుమారుడికి మరణశిక్ష విధించడమే సరైన చర్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకూ ముగ్గురు కుమార్తెలు ఉన్నారని తెలిపారు.

- Advertisement -

ట్రైనీ డాక్టర్ పట్ల తన కుమారుడు ప్రవర్తించిన తీరును ఓ తల్లిగా ఎప్పటికీ క్షమించలేనని స్పష్టంచేశారు. కుమార్తెకు ఇలాంటి దారుణమైన పరిస్థితి వస్తే తల్లి పడే వేదనను ఓ స్త్రీగా తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. తన కుమారుడి చేతిలో మరణించిన యువతని కూడా తన కుమార్తెలాగే భావిస్తానన్నారు. తన కుమారుడికి మరణశిక్ష విధించినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. మహా అయితే కొన్ని రోజులు కన్నీళ్లు పెడతానని ఆమె చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News