Sunday, January 19, 2025
HomeతెలంగాణRoad Accident: తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. 47 మంది యాత్రికులకు గాయాలు

Road Accident: తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. 47 మంది యాత్రికులకు గాయాలు

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) సంభవించింది. ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో 47 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గుడి హాత్నూర్ మండలం సూర్యగూడకు చెందిన 60 మంది యాత్రికులు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కెరిమెరిలోని జంగుబాయి ఆలయానికి ఓ వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యలో అదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండలం మాలెపూర్ ఘాట్లో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 47 మంది యాత్రికులకు తీవ్ర గాయాలు కాగా.. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News