Monday, January 20, 2025
HomeఆటKho Kho: ప్రపంచ విజేతగా భారత్.. ఖోఖో జట్లకు ప్రముఖుల శుభాకాంక్షలు

Kho Kho: ప్రపంచ విజేతగా భారత్.. ఖోఖో జట్లకు ప్రముఖుల శుభాకాంక్షలు

భారత్ వేదికగా జరిగిన తొలి ఖోఖో(Kho Kho) ప్రపంచకప్‌లో భారత జట్టు అదరగొట్టింది. అద్భుతమైన ఆటతో పురుషులు, మహిళల జట్లు జగజ్జేతలుగా నిలిచాయి. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లలో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా టీమిండియా నిలిచింది. ఈ నేపథ్యంలో రెండు జట్లకు సోషల్ మీడియా వేదికగా ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

ఖోఖో ప్రపంచకప్‌ కైవసం చేసుకున్న భారత జట్లను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అభినందించారు. ఈ విజయం యువతరానికి స్ఫూర్తినిస్తుందని ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్ చేశారు.

తొలి ఖోఖో వరల్డ్‌ కప్‌ గెలవడమే కాకుండా.. భారతదేశపు పురాతన క్రీడల్లో ఒకటైన ఈ ఆటకు పునరుజ్జీవాన్ని పోశారని సూపర్ స్టార్ మహేశ్‌ బాబు(Mahesh Babu) కొనియాడారు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోందని పేర్కొన్నారు.

భారత్‌కు చెందిన ప్రాచీన క్రీడ ఖోఖో తొలి ప్రపంచకప్ టీమిండియా గెలుచుకోవడం ఆనందంగా ఉందని దిగ్గజ దర్శకడు రాజమౌళి(SS Rajamouli) ప్రశంసించారు. అత్యద్భుతమైన ప్రదర్శనలతో తొలి టైటిల్స్ గెలిచి దేశం గర్వించేలా చేసినందుకు భారత మహిళ, పురుషుల జట్లకు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News