భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) సైలెంట్‌గా పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎలాంటి హడావుడి లేకుండా అత్యంత సన్నిహితుల సమక్షంలో చోప్రా వివాహం జరిగింది. రెండు రోజుల క్రితమే వివాహం జరిగినా తన పెళ్లి గురించి ప్రస్తావించలేదు. తాజాగా ఇన్‌స్టా ఖాతాలో పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు. ‘‘ నేను నా జీవితంలో కొత్త అధ్యాయాన్ని నా కుటుంబంతో ప్రారంభించాను. మమ్మల్ని ఈ క్షణం వరకు నడిపించేందుకు ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’’ అంటూ చోప్రా రాసుకొచ్చాడు.
దీంతో నీరజ్ పెళ్లి చేసుకున్న ఆమె గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. ఆమె పేరు హిమానీ మోర్. హర్యానాకు చెందిన హిమానీ అమెరికా న్యూ హాంప్‌షైర్‌లోని ఫ్రాంక్లిన్ పియర్స్ యూనివర్సిటీలో ‘స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్’, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్ మెంట్‌లో ఎంబీఏ డిగ్రీలు పొందారు. ప్రస్తుతం మసాచుసెట్స్‌లోని అమ్హెర్స్ట్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ.. మెక్‌కార్మాక్ ఇసెన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి మాస్టర్ ఆఫ్ సైన్స్ చదువుతున్నారు. కాగా నీరజ్.. పారిస్ ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో రజత పతకం.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే.