ఈరోజు ఎపిసోడ్‌లో ఫస్ట్‌నైట్ రూమ్‌కి తాళం వేసి ఉండటం చూసి ప్రభావతి మీనా మీద సీరియస్ అవుతూ అరుస్తుంది. కోడల ముందు పరువు పోతుంది వెళ్లి ఫోన్ తీసుకురా అని ఫోన్ చేస్తే బాలు ఫోన్ లిఫ్ట్ చేయడు. అక్కడ బాలు ఏమో ఆ లేచిపోయినోడికి శోభనం ఎలా జరుగుతుందో చూస్తాను అనుకుంటాడు. శృతి ఏమో నిద్ర వచ్చేస్తుంది అని పడుకుని పోతుంది. రవి ఏమైంది అని అడిగితే నీకు ఫస్ట్‌నైట్ జరగదు ఆ బాలు గాడు నీ రూమ్‌కి తాళం వేసాడు అంటాడు మనోజ్. ఈలోగా సత్యం వస్తాడు జరిగంది తెలుసుకుని బాలుకి ఫోన్ చేస్తాడు. మరోవైపు బాలు ఏమో హాయిగా శోభనం చెడగొట్టేసాను అని సంబంరపడిపోతాడు. సత్యం ఫోన్ చేసేసరికి లిఫ్ట్ చేసి మట్లాడుతాడు. నోరు మూసుకుని వచ్చి తాళం తీయమని తిడుతాడు.
శృతి ఏమో బాలు రూమ్‌లో ఎందుకు పెట్టారు అతనికి మేమంటే పడదు అని అడుగుతుంది. అంత మీనా వల్లే అని తన మీదకి తోసేస్తుంది. ఇంతలో బాలు వచ్చి తాళం ఇస్తాడు. ఇంట్లో అందరి ఆసీస్సులు తీసుకోవాలని సత్యం చెప్తాడు. ప్రభావతి ఆ బాలు ఆశీస్సులు వద్దు వాడు దీవించడు ఇంకా శాపనార్థాలు పెడతాడు అంటే అన్నగా ఆ మాత్రం హక్కు ఉంటుంది వీడేమి మంచి పని చేయలేదు, వీడు చేసిన పనికి ఆ మాత్రం చేయడం తప్పేమి కాదు అంటాడు సత్యం. మీనాని వెళ్లి బాలుని తీసుకురమ్మంటే మీనా వెళ్లి తీసుకొస్తుంది.
ఇంట్లోకి వచ్చిన బాలుతో వాళ్లని ఆశీర్వాదం ఇవ్వాలి అంటే నేను ఏమి ఇవ్వక్కర్లేదు మోసం చేసే వాడిని ఎందుకు ఆశీర్వదించాలని అని అంటాడు బాలు. నేను చెప్పినట్టు దీవించు అని సత్యం చెప్తే దానికి రివర్స్‌లో దీవిస్తాడు. సత్యం శృతి కలిసి కొంచెం సేపు వాదనలు పడతారు. తర్వాత ముగ్గురు కోడళ్లని, కొడుకళ్లని దగ్గర నుంచో పెట్టి ఈరోజు నుంచి మీరు అందరూ ఎలాంటి గొడవలు లేకుండా కలిసి ఉండాలని చెప్తాడు.