Monday, January 20, 2025
Homeచిత్ర ప్రభRangaraju : టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు రంగరాజు మృతి..!

Rangaraju : టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నటుడు రంగరాజు మృతి..!

టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది.. సీనియర్ నటుడు విజయ రంగరాజు మృతి చెందారు. ఇటీవల హైదరాబాద్ లో ఒ సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డారు.. అనంతరం రంగరాజును చెన్నైకి తరలించారు. ఈ క్రమంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గుండె పోటుతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. రంగ‌రాజు మ‌ర‌ణవార్త తెలుసుకున్న ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆయ‌న‌కు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు.

- Advertisement -

విజయ రంగరాజు అస‌లు పేరు రాజ్ కుమార్. ఆయన చెన్నైలో రంగస్థల కళాకారునిగా అనేక నాటకాలలో నటించారు. ఆ తర్వాత సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. బాపు దర్శకత్వంలో వచ్చిన సీతా కళ్యాణం ద్వారా.. వెండితెరకు ఆయన పరిచయం అయ్యారు. ఇక 1994లో వచ్చిన భైరవ ద్వీపం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదే కాకుండా అశోక చక్రవర్తి, స్టేట్ రౌడీ, విజయ్ వంటి చిత్రాల్లో తన నటనతో మెప్పించారు.

న‌టుడిగా, ఫైట్‌ మాస్టర్‌గా, ఫైటర్‌గా, విలన్‌గా అన్ని భాషల్లో కలుపుకుని దాదాపు ఐదు వేలకు పైగా సినిమాల్లో ఆయన పనిచేశారు. గోపీచంద్ న‌టించిన‌ యజ్ఞం సినిమాలో ఆయ‌న విల‌న్‌గా న‌టించ‌డం తన కెరీర్‌లో ట‌ర్నింగ్ పాయింట్ అని ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో ఆయన తెలిపారు. అంతేకాదు వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ లో కూడా ప్రవేశం ఉందని తెలుస్తోంది. తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. ఇక ఆయనకు ఇద్దరు కూతుళ్లున్నారు.

విజయ రంగారాజు మాటలు కొన్ని కాంట్రవర్సీకి దారి తీసిన సంగతి తెలిసిందే. విష్ణు వర్దన్ గురించి మాట్లాడి విజయరంగరాజు కన్నడ ఇండస్ట్రీ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. కిచ్చా సుదీప్ సైతం బాహాటంగానే విజయరంగరాజుపై ఫైర్ అయ్యాడు. అనంతరం తన వ్యాఖ్యలపై రంగరాజు క్షమాపనలు చెప్పారు. ఇక రంగ‌రాజు మ‌ర‌ణవార్త తెలుసుకున్న ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఆయ‌న‌కు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News