దండేపల్లి మండల పరిధిలోని తాళ్లపేట, లింగపూర్, మ్యాదారిపేట గ్రామాలలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశానుసారం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారి ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల పట్ల, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల బృందంచే అవగాహన కల్పించారు. ప్రజలందరూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని తెలియచెప్పారు. ఈగలు దోమలు లేకుండా పరిసరాల పరిశుభ్రత పై పాటిస్తూ మలేరియా, డెంగ్యూ ,మెదడు వా పు, మొదలైన వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కళాకారుల మాటా పాట ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు టీం లీడర్ లావుడ్యా రమేష్ ,గుడిసెల కృష్ణ, రామటేనికి రాజతిరుపతి, సత్యం, సల్లూరి కృష్ణ , కాసీ పేట సంతోష్ మరియు మండల వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కృపావరం,రాధిక, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.