ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఓ ప్రతిపాదనను టీడీపీ నేతలు లేవనెత్తుతున్నారు. టీడీపీ యువ నేత, మంత్రి నారా లోకేష్(Nara Lokesh)కు డిప్యూటీ సీఎం(Deputy CM) పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా నేతల వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తవకముందే ఇలాంటి పరిస్థితులు తీసుకురావడం సరికాదని మండిపడింది. ప్రభుత్వం మీద ప్రజలు పెద్ద బాధ్యతను పెట్టారని.. ఆ బాధ్యతను నిలబెట్టుకునే పనిలో ఉండాలని సూచించింది. ఇక నుంచి ఈ అంశంపై నేతలెవరూ మాట్లాడొద్దని హెచ్చరించింది. ఏదైనా కూటమి నేతలు చర్చించుకున్నాకే తుది నిర్ణయాలుంటాయని స్పష్టం చేసింది.
Nara Lokesh: లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి డిమాండ్స్.. అధిష్టానం ఆగ్రహం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES