తెలంగాణలో మందుబాబులకు గుడ్ న్యూస్. కింగ్ ఫిషర్(Kingfisher) బీర్ల సరఫరాపై యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వంతో చర్చల అనంతరం వినియోగదారులు, కార్మికుల వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. సెబీ రెగ్యులేషన్స్‌కి అనుగుణంగా తెలంగాణ బీవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్‌కి బీర్ల సరఫరాను తక్షణమే అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.
- Advertisement -
ధరల పెంపు, బకాయిల చెల్లింపులపై బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్‌తో చర్చలు జరిపింది. సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడంతో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ తెలిపింది.