Monday, January 20, 2025
Homeనేషనల్Vijay: దూకుడు పెంచిన విజయ్.. రైతుల పోరాటానికి మద్దతు

Vijay: దూకుడు పెంచిన విజయ్.. రైతుల పోరాటానికి మద్దతు

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగమ్(TVK) పేరుతో కొత్త పార్టీని కూడా ఆయన ప్రారంభించారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయి రాజకీయాలు మొదలుపెట్టారు. తాజాగా పరందూరు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతు తెలిపారు.

- Advertisement -

రైతుల శిబిరాన్ని సందర్శించిన విజయ్.. తనదైన శైలిలో ప్రసంగించారు. దేశానికి అన్నదాతలే వెన్నెముక అని.. న్యాయం జరిగే వరకు రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రైతుల ధర్నా శిబిరం నుంచే తన క్షేత్రస్థాయి రాజకీయాలకు నాంది పలుకుతున్నానని తెలిపారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని.. అయితే సాగుభూమిలో ఎయిర్ పోర్టు నిర్మించడం సబబు కాదని సూచించారు. పంటలు పండే రైతుల భూమిలో కాకుండా మరో చోట ఎయిర్ పోర్టు నిర్మాణం చెబితే ఎవరికీ అభ్యంతరం లేదని విజయ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News