Monday, January 20, 2025
HomeతెలంగాణPrathibha Awards: ప్రతిభా పురస్కారాల జాబితాను ప్రకటించిన గవర్నర్ కార్యాలయం

Prathibha Awards: ప్రతిభా పురస్కారాల జాబితాను ప్రకటించిన గవర్నర్ కార్యాలయం

గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులను తెలంగాణ గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు రంగాలకు చెందిన వారికి పురస్కారాలు అందించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnudev Varma) నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అవార్డుకు ఎంపికైన ఎనిమిది మందితో కూడిన జాబితాను రాజ్ భవన్ వెల్లడించింది. వీరిలో దుశర్ల సత్యనారాయణ, అరికపూడి రఘు, పారా ఒలింపిక్ విజేత జీవాంజీ దీప్తి, ప్రొఫెసర్ ఎం.పాండురంగరావు-పీ.బీ.కృష్ణభారతితో పాటు ధ్రువాంశు ఆర్గనైజేషన్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, ఆదిత్య మెహతా ఫౌండేషన్, సంస్కృతి ఫౌండేషన్‌ ఉన్నాయి.

- Advertisement -

ఈనెల 26న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా వివిధ రంగాల్లో సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాలలో గత ఐదేళ్ళుగా సేవలు అందిస్తున్న వారికి ప్రతిభా పురస్కారాలను అందిస్తారు. అవార్డు కింద రూ.2లక్షలతో పాటు జ్ఞాపికను అందిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News