Monday, January 20, 2025
Homeనేషనల్Karnataka: కర్ణాటకలో దారుణం.. 15 ఏళ్ల కూతురిని 45ఏళ్ల వ్యక్తికి కట్టబెట్టిన తండ్రి..!

Karnataka: కర్ణాటకలో దారుణం.. 15 ఏళ్ల కూతురిని 45ఏళ్ల వ్యక్తికి కట్టబెట్టిన తండ్రి..!

ఆడపిల్ల పుట్టిందంటే.. మహాలక్ష్మి పుట్టిందని పుట్టిందని సంతోషించే కుటుంబాలు మన దేశంలో కొన్ని ఉంటే.. వారిని భారంగా భావించేవారు అనేక మంది ఉన్నారు. ఒకప్పుడు బాల్య వివాహాలు, ఎదురు కట్నం కోసం ముసలి వాళ్లకు చిన్న అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేసేవారని విన్నాం. కానీ నేటికీ ఇలాంటి వారు ఉన్నారని కర్ణాటకలోని ఓ ఘటన చెపుతోంది. కూతురి పట్ల కన్న తండ్రే కసాయి వాడయ్యాడు. ముక్కు పచ్చలారని పసి కందును తీసుకెళ్లి బలవంతంగా ముసలోడికి కట్టబెడ్డాడు.

- Advertisement -

కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ జిల్లా శిడ్లఘట్ట తాలూకాలోని గోరామడుగు గ్రామంలో 15 సంవత్సరాల బాలికను 45 ఏళ్ల మంజునాథ్ అనే వ్యక్తితో బలవంతంగా వివాహం చేశారు. ఈ వివాహం అమ్మాయి తల్లి రుక్మిణి అనుమతి లేకుండా జరిగింది. బాలిక తండ్రి నారాయణస్వామి తన భార్య, కుమార్తెను బెదిరించి వివాహం చేశాడంట. ఈ ఘటన బాలిక భద్రతపై తీవ్రమైన ఆందోళనను కలిగించింది. వివాహం జరగడంతో ఆమె తల్లి రుక్మిణి, బాలిక వివాహానికి వ్యతిరేకత తెలపడంతో నారాయణస్వామి వారిపై దుర్మార్గంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. ఈ ఘటనపై చిక్కబళ్లాపూర్ పోలీసులు స్పందించి.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన బాల్య వివాహాలను అరికట్టాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చేలా చేసింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2018లో ప్రారంభించిన ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం కింద, 15,000 గ్రామాలను బాల్య వివాహాల నుంచి విముక్తం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ పిల్లలను రక్షించడం, విద్య అందించడం, సాధికారత కల్పించడం కోసం చేపట్టిన ప్రణాళికల్లో భాగంగా, బాల్య వివాహాలను అరికట్టే ప్రయత్నం జరుగుతోంది. పోలీసులు ఈ కేసును పటిష్టంగా దర్యాప్తు చేస్తూ, నిందితులపై చర్యలు తీసుకుంటారని తెలిపారు. తాజాగా ఈ ఘటన వెలుగులోకి రావడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News