Sunday, October 6, 2024
HomeతెలంగాణHyd: విమలక్కతో బీఆర్ఎస్ నేత మహిళా దినోత్సవం

Hyd: విమలక్కతో బీఆర్ఎస్ నేత మహిళా దినోత్సవం

విమలక్క బీఆర్ఎస్ పార్టీకి చాలా దూరంగా ఉంటారు. పైగా కేసీఆర్, ఆయన పార్టీపై నిప్పులు చెరుగుతారు. అలాంటి విమలక్కను మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇంటికి ఆహ్వానించి మరీ సన్మానించి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పటం విశేషంగా చెప్పుకుంటున్నారు.

- Advertisement -

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బంజారా హిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ సురభి వాని దేవి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, అరుణోదయ సాంస్కృతిక సమైక్య వ్యవస్థాపకురాలు విమలక్కలను సత్కరించి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అయితే విమలక్కను ఇలా టీఆర్ఎస్ శ్రేణులు ఆహ్వానించి, సత్కరించిన సందర్భాలు అత్యంత అరుదనే చెప్పుకోవాలి. ఆఖరుకి బతుకమ్మ పండుగ కూడా ‘బహుజన బతుకమ్మ’ అంటూ తనదైన స్టైల్లో నిర్వహించే విమలక్క ఇలా అధికార పార్టీ నేత ఇంటికెళ్లటం విశేషమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News