Wednesday, January 22, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: ఉగ్రవాదుల కాల్పుల్లో ఏపీ జవాన్ మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

CM Chandrababu: ఉగ్రవాదుల కాల్పుల్లో ఏపీ జవాన్ మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

జమ్మూకశ్మీర్‌‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏపీకి చెందిన ఆర్మీ జవాన్ పంగల కార్తీక్ మృతి చెందడంపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా తన సానుభూతి వ్యక్తం చేశారు. “జమ్మూ కాశ్మీర్‌ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ కార్తీక్ మృతి చెందిన వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ కార్తీక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నాను.” అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

సోమవారం ఉదయం ఉగ్రవాదుల కదలికలపై సమాచారంతో నార్త్ జమ్మూకశ్మీర్ లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో జవాన్ కార్తీక్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. తోటి సైనికులు హుటాహుటిన ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ వీరమరణం పొందారు.
మృతదేహం మూడు రోజుల్లో స్వగ్రామానికి వస్తుందని గ్రామ సర్పంచ్ శ్రీహరి తెలిపారు.

కాగా చిత్తూరు జిల్లాలోని బంగారు పాల్యం మండలం రాగి మానుపెంట గ్రామానికి చెందిన పంగల కార్తీక్ 2017లో ఆర్మీలో చేరారు. కార్తీక్ మరణవార్తతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News