Wednesday, January 22, 2025
HomeఆటICC అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియా మహిళల దూకుడు..

ICC అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియా మహిళల దూకుడు..

ఐసీసీ మహిళల అండర్-19 మహిళల టీ-20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా దూసుకెళ్లిపోతోంది. టోర్నీలో భారత మహిళలు రెండో విజయాన్ని అందుకున్నారు. తాజాగా మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో భారీ విక్టరీ కొట్టారు. ఈ మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా.

- Advertisement -

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన మలేషియాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. 14.3 ఓవర్లలో కేవలం 31 పరుగులకే కట్టడి చేశారు. భారత బౌలర్లలో స్పిన్నర్ వైష్ణవి శర్మ హ్యాట్రిక్ సాధించింది. ఆమె మొత్తం ఐదు వికెట్లు పడగొట్టి స్పెల్ వేసింది. మరో స్పిన్నర్ ఆయుషి శుక్లా మూడు వికెట్లు తీశారు. వీరిద్దరూ ధాటికి మలేషియా బ్యాట్స్‌మెన్‌లు క్రీజులో నిలవలేకపోయారు. మలేషియా జట్టులోని సభ్యులెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.

నలుగురు బ్యాటర్లు డకౌట్ కాగా, ఇద్దరు ఐదు పరుగులు, ఇద్దరు మూడు పరుగులు, ఒకరు రెండు పరుగులు, ఇద్దరు ఒక పరుగు చేశారు. అనంతరం అతి చిన్న లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ కేవలం 2.5 ఓవర్లలోనే మ్యాచ్ ముగించారు. ఓపెనర్లు గొంగడి త్రిష, జె కమలిని ఇన్నింగ్స్ ప్రారంభించారు. త్రిష 12 బంతుల్లో 5 బౌండరీలు సాయంతో 27 పరుగులు చేయగా.. కమలిని ఐదు బంతుల్లో 4 పరుగులు చేయడంతో.. వికెట్ నష్టపోకుండానే విజయం సాధిచారు. ఈ విజయంతో గ్రూప్ Aలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News