Wednesday, January 22, 2025
Homeనేషనల్Amit shah: భారీగా మావోయిస్టులు మృతి.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Amit shah: భారీగా మావోయిస్టులు మృతి.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఛత్తీస్‌గఢ్‌-ఒడిశా (Chhattisgarh-Odisha) సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. తాజాగా దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit shah) స్పందించారు. ఇది నక్సల్స్‌ లేని భారత్ దిశగా కీలక అడుగని వ్యాఖ్యానించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

- Advertisement -

‘‘ఇది నక్సలిజానికి గట్టి ఎదురుదెబ్బ. భద్రతా బలగాలకు ఇది గొప్ప విజయం. నక్సల్స్‌ లేని భారత్‌ దిశగా ఇది ఓ కీలక అడుగు. దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉంది. సీఆర్‌పీఎఫ్(CRPF), ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బలగాలు ఈ జాయింట్‌ ఆపరేషన్‌లో భాగమయ్యాయి’’ అని పేర్కొన్నారు.

కాగా అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి దేశంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేపడుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో భారీగా మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. వీరిలో ఎంతో మంది కీలక నక్సల్స్‌ నేతలు కూడా ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News