Wednesday, January 22, 2025
Homeచిత్ర ప్రభSaif Ali Khan: ఆసుపత్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్

Saif Ali Khan: ఆసుపత్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ (Saif Ali Khan) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండంటతో ఆరు రోజుల చికిత్స అనంతరం లీలావతి ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. దీంతో సైఫ్ నేరుగా ఫార్చ్యూన్ హైట్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

- Advertisement -

దాడిలో భాగంగా సైఫ్‌ వెన్నెముకకు తీవ్రగాయం కాగా.. సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు. ఇప్పటివరకు సైఫ్‌ ఆసుపత్రి బిల్‌ రూ. 40 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. అయితే హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉండటం వల్ల బీమా కంపెనీ రూ.25 లక్షలు చెల్లించినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఈ దాడి కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్‌ షరీఫుల్‌ ఇస్లాం షెహజాద్‌ను క్రైమ్ ‌సీన్‌ రీక్రియేషన్‌ కోసం సైఫ్‌ ఇంటికి తీసుకెళ్లారు. ఫోరెన్సిక్‌ అధికారులు కూడా సైఫ్‌ ఇంటికి వెళ్లి దాడి జరిగిన ప్రదేశంలో నిందితుడి వేలిముద్రలు గుర్తించారు. ఇంట్లోని కిటికీలతో పాటు లోపలికి వచ్చేందుకు ఉపయోగించిన నిచ్చెనపై కూడా నిందితుడి వేలిముద్రలు ఉన్నాయన్నారు. నిందితుడు బాత్ రూమ్‌ కిటికీ నుంచి ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News