టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy)పై సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నటి మాధవీలత(Madhavi Latha) ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన గురించి జేసీ చేసిన వ్యాఖ్యలపై మానసిక వేదనకు గురయ్యాయని వెల్లడించారు. మహిళలపై అసభ్యకరంగా మాట్లాడి తర్వాత క్షమాపణ చెబితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. సీనియర్ రాజకీయ నాయకుడైన ప్రభాకర్ రెడ్డి.. ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని మండిపడ్డారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. కాగా అంతకుముందు మా అసోసియేషన్‌కు కూడా మాధవీలత ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Madhavi Latha: జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ కమిషనర్‌కు మాధవీలత ఫిర్యాదు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES