Wednesday, January 22, 2025
Homeఆంధ్రప్రదేశ్Liquor Shops: గీత కార్మికులకు మద్యం షాపులు.. నోటిఫికేషన్ జారీ

Liquor Shops: గీత కార్మికులకు మద్యం షాపులు.. నోటిఫికేషన్ జారీ

గీత కార్మికులకు 335 మద్యం షాపుల(Liquor Shops) కేటాయింపు కోసం కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఆధ్వర్యంలో లాటరీలు తీసి లైసెన్స్‌లు కేటాయించనున్నారు. కార్మికులు కుల, నేటివిటీ ధ్రువపత్రాలు సమర్పించాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఒక షాపుకి ఫీజు రూ.2 లక్షల నాన్ – రిఫండబుల్ మొత్తాన్ని నిర్ణయించింది. ఆయా జిల్లాల పరిధిలో కేటాయించిన అన్ని షాపులకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. కానీ ఒకరికి ఒక షాపు మాత్రమే కేటాయించనున్నట్టు పేర్కొంది. ఒకటి కంటే ఎక్కువ షాపులు వస్తే ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని తెలిపింది. ఇక రెండేళ్ల కాలానికి లైసెన్స్ ఇవ్వనున్నట్టు వెల్లడించింది.

- Advertisement -

కాగా అక్టోబర్‌ నెలలో ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో 10శాతం షాపులను గీత కులాలకు కేటాయించింది. తిరుపతి జిల్లాలో అత్యధికంగా 23 షాపులు, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక షాప్ కేటాయించారు. ఇక అనంతపురం-14, శ్రీసత్యసాయి-9, అన్నమయ్య-11, చిత్తూరు-10, తూర్పు గోదావరి-13, కాకినాడ-16, కోనసీమ-13, బాపట్ల-12, గుంటూరు-13, పల్నాడు-13, కడప-14, కృష్ణా-12, ఎన్టీఆర్‌-11, శ్రీకాకుళం-18, అనకాపల్లి-15, విశాఖపట్నం-14, విజయనగరం-16, ఏలూరు-14, పశ్చిమగోదావరి-18, కర్నూలు-10, నంద్యాల-11, నెల్లూరు-18, ప్రకాశం-18, పార్వతీపురం మన్యం-4 షాపులు లెక్కన కేటాయించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News