Wednesday, January 22, 2025
Homeఆంధ్రప్రదేశ్Group 1 Exams: గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటన

Group 1 Exams: గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల తేదీలు ప్రకటన

గ్రూప్ 1 పరీక్షల(Group 1 Exams) కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) శుభవార్త అందించింది. పరీక్షల తేదీలను తాజాగా ప్రకటించింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

మే 3న తెలుగు, 4న ఇంగ్లీష్, 5న పేపర్ 1 జనరల్ ఎస్సే, 6న పేపర్ 2 హిస్టరీ-కల్చరల్, 7న పేపర్ 3 పాలిటీ-లా, 8న పేపర్ 4 ఎకానమి, 9న పేపర్ 5 సైన్స్, టెక్నాలజీ పరీక్షలు జరగుతాయని తెలిపింది. పరీక్షలన్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయని పేర్కొంది. ఇక మెయిన్స్ పరీక్షా పత్రాలను ట్యాబుల్లో ఇవ్వాలని నిర్ణయించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News