Wednesday, January 22, 2025
Homeహెల్త్Phone: తెల్లార్లు ఫోన్ వాడేస్తున్నారా.. అయితే వ్యాధి సోకడం ఖాయం..!

Phone: తెల్లార్లు ఫోన్ వాడేస్తున్నారా.. అయితే వ్యాధి సోకడం ఖాయం..!

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. నిద్ర లేచింది మొదలు తిరిగి పడుకునే వరకు చాలా మంది ఫోన్లతోనే గడుపుతున్నారు. అయితే ఇలా ఎక్కువసేపు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడం దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఇబ్బందులకి గురిచేసే అవకాశం ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో ఇది భాగం అయిపోయింది. నిద్ర లేచింది మొదలు తిరిగి పడుకునే వరకు చాలా మంది ఫోన్లతోనే గడుపుతున్నారు. అయితే ఇలా ఎక్కువసేపు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడం దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఇబ్బందులకి గురిచేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

అర్ధరాత్రి నుంచి ఉదయం 6 గంటల మధ్య ఫోన్ ఎక్కువగా వాడటం వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని తేలింది. ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు 40 నుంచి 69 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 85,000 మందిని తొమ్మిదేళ్ల పాటు పరిశీలించారు. చేతి మణికట్టుకు ఒక పరికరాన్ని అమర్చి వారు కాంతికి గురువున్న సమయాన్ని ట్రాక్ చేశారు.
రాత్రిపూట కాంతికి గురికావడం మరియు టైప్ -2 డయాబెటిస్‌కి మధ్య సంబంధాన్ని అధ్యయనంలో కనుగొన్నారు. రాత్రిపూట మొబైల్ కాంతికి గురవుతున్న టాప్ 10 శాతంలో 67 శాతం మందికి మిగతా వారితో పోలిస్తే ఎక్కువగా వ్యాధి వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది.

నిద్ర వ్యవధి, మొత్తం ఆరోగ్య అలవాట్లు వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత వీటి మధ్య సంబంధాన్ని కనుగొన్నారు. ఈ అధ్యయనం ప్రభావాన్ని రుజువు చేయనప్పటికీ కృత్రిమ కాంతి శరీర సహజ నిద్ర మేల్కొనే చక్రానికి అంతరాయాన్ని కలిగిస్తోందని, ఇది జీవక్రియ సమస్యలకు దారి తీయవచ్చని సూచిస్తోంది.

స్మార్ట్‌ఫోన్లు, టీవల నుంచి వెలువడే బ్లూ లైట్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతోంది. రాత్రిపూట కాంతి మరియు మధుమేహం మధ్య సంబంధాన్ని పటిష్టం చేయడానికి భవిష్యత్తు అధ్యయనాలు అవసరమవుతాయని పరిశోధకులు చెప్పారు. అందుకే రాత్రి సమయంలో ఫోన్ ఎక్కువగా చూడటం మంచిది కాదని సూచిస్తున్నారు. అందుకే పడుకునే గంట ముందు ఫోన్ పక్కన పడేయాలని నిపుణులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News