Wednesday, January 22, 2025
HomeతెలంగాణKTR: పేరుకే ప్రజా పాలన.. మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు: కేటీఆర్‌

KTR: పేరుకే ప్రజా పాలన.. మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు: కేటీఆర్‌

పేరుకే ప్రజాపాలన కానీ దివ్యాంగుడైన ఒక మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

“బీఆర్ఎస్ పార్టీకి భయపడి నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వకుండా, ఫ్లెక్సీలు చింపి, ఏకంగా ప్రభుత్వ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యేను బూతులు తిడుతూ పోలీసుల ముందే దాడికి పాల్పడ్డ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరులు. పోలీసుల ముందే దాడి చేసింది మంత్రి అనుచరులు అయితే ఉల్టా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాడి చేసిన వారి మీద మాత్రం ఎలాంటి చర్యలు లేవు. ఇదీ కాంగ్రెస్ అరాచక పాలన తీరు. కంచర్ల భూపాల్ రెడ్డి మీద జరిగిన ఈ పాశవిక దాడిని ఖండిస్తున్నాను. బాధ్యుల మీద కేసులు నమోదు చేయవలసిందిగా డీజీపీ కోరుతున్నాను” అని కేటీఆర్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News