Wednesday, January 22, 2025
Homeచిత్ర ప్రభRashmika Mandanna: వీల్ చైర్‌లో రష్మిక మందన్న..వీడియో వైరల్‌

Rashmika Mandanna: వీల్ చైర్‌లో రష్మిక మందన్న..వీడియో వైరల్‌

నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna)వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ‘పుష్ప2’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీలో రష్మిక నటనకు విమర్శకులు ప్రశంసలు లభించాయి. ఇదిలా ఉంటే ధనుష్‌తో ‘కుబేర’, విక్కీ కౌశల్‌తో ‘చావా’ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల్లో ఈ హ్యాట్ బ్యూటీ నటిస్తున్నారు. తాజాగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘చావా’ సినిమా నుంచి రష్మిక లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో మహారాణిలా రష్మిక ఆకట్టుకున్నారు.

- Advertisement -

తాజాగా నడవలేని స్థితిలో రష్మిక కనిపించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వీల్ చైర్‌లో వెళ్లడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఇటీవల జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా ఆమె కాలుకు గాయమైంది. అయితే ఆ గాయం పెద్దది కావడంతో ఆమె నడవడానికి ఇబ్బంది పడుతున్నారు. వీల్ చైర్‌లో రష్మిక వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రష్మిక త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News