ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Kakani Govardhan Reddy)పై పోలీస్ కేసు నమోదైంది. ఇటీవల టీడీపీ, వైసీపీ నేతల మధ్య బోగోలు మండలం కోళ్లదీన్నేలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైసీపీ కార్యకర్తలను పరామర్శించడానికి ఆసుపత్రికి వచ్చిన గోవర్థన్ రెడ్డి.. పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు.
కొద్దిరోజుల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని.. ఈ పోలీసు అధికారులు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి బట్టలూడదీస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే టీడీపీ నేతలు, కార్యకర్తలను ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత వంటేరు ప్రసన్న కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 224, 351/2, 352, 353/2 సెక్షన్ల కింద కాకాణిపై కేసులు నమోదు చేశారు.