Wednesday, January 22, 2025
Homeపాలిటిక్స్Bhuvanagiri: మాపై దాడులా? మా సైనికులు మిమ్మల్ని తిరగనీరు: కవిత

Bhuvanagiri: మాపై దాడులా? మా సైనికులు మిమ్మల్ని తిరగనీరు: కవిత

నల్గొండలో కవిత

యాదాద్రి భోనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడిన కవిత, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదని ఘాటుగా స్పందించారు. 60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం బిఆర్ఎస్ పార్టీ అన్న కవిత, 60 లక్షల మంది బిఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూసినా పార్టీ కార్యకర్తలు ఊరుకోరని ఆమె పరుషంగా వ్యాఖ్యానించటం విశేషం.

- Advertisement -

మూసీని మేం క్లీన్ చేయాలనుకున్నాం

రౌడీ మూకలను వేసుకొని పార్టీ కార్యాలయాలపై దాడి చేసే దరిద్రపు సంస్కృతి కాదు తమది కాదన్న కవిత, మాటలతో, విజ్ఞతతో, నిబద్ధతతో ప్రజల కోసం పోరాటం చేసే సంస్కృతి తమదని చెప్పుకొచ్చారు. మూసి మురికిమయం కావడానికి కారకులు ఎవరో ప్రజలు గుర్తించాలని, పారిశ్రామిక వ్యర్ధాలు మూసిలో కలుస్తుంటే 60 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసింది ? అని నిలదీశారు. మూసి నదిని ప్రక్షాళించడానికి కేసీఆర్ సంకల్పించారని, అందులో భాగంగానే ఎస్టీపీలను ఏర్పాటు చేయడమే కాకుండా గోదావరి నదితో అనుసంధానం చేయాలనుకున్నారని గుర్తుచేశారు. మూసిలో మురుగునీటి శుద్ధి కోసం 31 ఎస్టీపీలను కెసిఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, మూసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని, మూసిని కాంగ్రెస్ నాయకులు ఏటీఎంగా తయారు చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

కొండపోచమ్మ కాదని మల్లన్న సాగర్ నుంచా?

హైదరాబాదుకు దగ్గరలో ఉన్న కొండపోచమ్మ సాగర్ ను వదిలేసి దూరంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి మూసి – గోదావరి అనుసంధానం చేస్తామని ప్రభుత్వం అనడం సరికాదని, కేవలం కాంట్రాక్టర్ల కోసమే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని కవిత ఆరోపించారు. ఇందుకు అనువుగా అనుసంధాన ప్రాజెక్టు వేయండి రూ 7500 కోట్లకు పెంచారని, రూ. 7500 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, కొండపోచమ్మ నుంచి మూసి అన్నసంధానం చేసే ఆస్కారం ఉన్నప్పుడు ఈ కొత్త ప్రాజెక్టు ఎందుకు? నల్లగొండ జిల్లాకు చెందిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

మిషన్ భగీరథ అందుకే కదా

మూసి ప్రక్షాళన పేరిట పేద ప్రజల ఇళ్లను కూల్చివేత కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని, మూసి ప్రక్షాళనకు అయ్యే వ్యయం 50 వేల కోట్లు అని ఒకసారి, లక్ష కోట్లు అని మరొకసారి, లక్షన్నర కోట్లు అని ఇంకోసారి సీఎం చెబుతున్నారని మండిపడ్డారు. మూసిని ఏటీఎంగా మార్చుకొని, వచ్చే డబ్బును ఢిల్లీకి పంపించే ప్రణాళిక వేసుకున్నారని, యాదాద్రిలో కేసీఆర్ మొదలు పెట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని, యాదాద్రి వైభవాన్ని ప్రభుత్వం కాపాడాలని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి కేసిఆర్ ఎంతగానో కృషి చేశారని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతాన్ని పారద్రోల్లడానికి కేసీఆర్ సంకల్పించారని, అందులో భాగంగానే మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగునీరు సరఫరా చేశారని, ఫ్లోరైడ్ ని నిర్మూలించిన ఘనత కేసిఆర్ దే అంటూ కవిత వెల్లడించారు. అనేక సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఒక వాటర్ ప్లాంట్ పెట్టిన పాపాన పోలేదని కవిత విమర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News