Wednesday, January 22, 2025
Homeచిత్ర ప్రభNaga Shaurya: 'బ్యాడ్ బాయ్‌' నాగశౌర్య.. వైల్డ్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్

Naga Shaurya: ‘బ్యాడ్ బాయ్‌’ నాగశౌర్య.. వైల్డ్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్

యంగ్‌ హీరో నాగశౌర్య(Naga Shaurya) మరో ప్రాజెక్టును ప్రకటించాడు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ మూవీకి ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అనే వెరైటీ పేరు పెట్టారు. ఈ పోస్టర్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా వైల్డ్‌గా శౌర్య కనిపించాడు. వ్యాన్ వెనక భాగంలో కూర్చుని, చేతులకు రక్తం కారుతుండగా, నుదుటిపై అదే రక్తాన్ని విభూదిలా పెట్టుకుని సీరియస్ లుక్‌లో ఉన్నాడు. దీంతో ఈ మూవీ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇక డెబ్యూ డైరెక్టర్ రామ్ దేశిన దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాను శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ పతాకంపై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీకి చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు హారీస్ జైరాజ్ సంగీతం అందిచడం విశేషం. ప్రస్తుతం శరవేంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News