Wednesday, January 22, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: దావోస్‌లో బిల్ గేట్స్‌తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు

Chandrababu: దావోస్‌లో బిల్ గేట్స్‌తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు

దావోస్‌(Davos)లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) బిజీ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ పర్యటనలో మూడో రోజు కూడా పలు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు.

- Advertisement -

ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్(Bill Gates)తో భేటీ అవుతున్నారు. ఏపీ సామాజిక, ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే దిశగా భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా చర్చలు జరపనున్నారు. అలాగే యూనిలీవర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీ కో, ఆస్ట్రా జెనెకా సంస్థల అధిపతులతో సమావేశం కానున్నారు.

సుస్థిర ఇంధన కార్యక్రమాలకు సంబంధించి గ్రీన్ కో సంస్థతో ఎంఓయూ(MOU) కుదుర్చుకోనున్నారు. వీటితో పాటు కీలక రౌండ్ టేబుల్ చర్చల్లో చంద్రబాబు పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాలు, స్నేహపూర్వకమైన పాలసీలు, విభిన్న రంగాల్లో ఉన్న అవకాశాలపై పెట్టుబడిదారులకు వివరించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News