విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం(Durga Temple) ప్రధాన అర్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. బద్రీనాథ్ బాబు మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి(anam ramanarayana reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం ఎంతో బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.
- Advertisement -
ప్రధాన అర్చకులుగా అమ్మవారి అలంకరణ, ఆచార వ్యవహారాల్లో అపారమైన అనుభవంతో సేవలందించారని గుర్తు చేశారు. అమ్మవారికి ఆయన అందించిన సేవలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.