Wednesday, January 22, 2025
HomeతెలంగాణCrime News: హనుమకొండలో దారుణం.. నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ హత్య

Crime News: హనుమకొండలో దారుణం.. నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ హత్య

హనుమకొండ(Hanumakonda)లో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ ఆటోడ్రైవర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని డీమార్ట్‌ ఎదురుగా అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. మడికొండకు చెందిన ఆటోడ్రైవర్లు రాజ్‌కుమార్‌, వెంకటేశ్వర్లు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో రాజ్‌కుమార్‌ స్పాట్‌లోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News