టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్(Nara Lokesh)కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే అంశం ఏపీ రాజకీయల్లో కలకలం రేపుతోంది. లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ కొందరు టీడీపీ నేతలు చేసిన డిమాండ్ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ అంశంపై సీరియస్ అయిన టీడీపీ హైకమాండ్ ఈ అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దని పార్టీ నేతలకు ఆదేశాలు జరీ చేసింది. అలాగే జనసేన కూడా ఈ అంశంపై మాట్లాడొద్దని క్యాడర్‌కు ఆదేశించిన సంగతి తెలిసిందే.
తాజాగా దావోస్(Davos) పర్యటనలో ఉన్న లోకేష్ ఓ జాతీయ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మీరు డిప్యూటీ సీఎం(Deputy)అనే వార్తలు వస్తున్నాయనే ప్రశ్న ఎదురైంది. దీనికి అవి రాజకీయపరమైన కామెంట్లని ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం తాను రాజకీయంగా మంచి పొజిషన్ లో ఉన్నానని చెప్పారు. గత ఎన్నికల్లో ప్రజలు తమను మంచి మెజార్టీతో గెలిపించారని.. 94 శాతం సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం తనకు అప్పగించిన శాఖలపై పూర్తి స్థాయిలో పని చేస్తున్నానని పేర్కొన్నారు. ఏపీని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తయారు చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు.