నల్గొండలో బీఆర్ఎస్(BRS) తలపెట్టిన రైతు మహా ధర్నాకు రాష్ట్ర హైకోర్టు(TG Highcourt) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ధర్నా చేయాలని స్పష్టం చేసింది. పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ధర్నా నిర్వహించుకోవాలని సూచించింది. కాగా ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతుందని ఆరోపిస్తూ జనవరి 21న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్ఎస్ భావించింది. అయితే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గులాబీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం షరతులతో అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు నిర్ణయంతో మహాధర్నాకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)తో పాటు కీలక నేతలందరూ పాల్గొననున్నారు. రైతు భరోసాను రూ.15వేల నుంచి రూ.12వేలకు కుదించడం, రూ.4వేల పింఛన్, మహిళలకు రూ.2500, విద్యార్థినులకు స్కూటీలు వంటి పథకాలు అమల్లో జాప్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు.